Random Video

Telangana Elections 2018 : మోడీ టూర్.. బీజేపీ ఆశలు, మూడు విడతలుగా అమిత్ షా పర్యటన | Oneindia Telugu

2018-11-22 419 Dailymotion

PM narendra modi, bjp national president amit shah election campaign tour confirmed for telangana elections.
#TelanganaElections2018
#BJP
#TRS
#modi
#amitshah


తెలంగాణ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీలు స్టార్ క్యాంపెయినర్లతో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈనెల 27 తో పాటు వచ్చే నెల 3న మోడీ షెడ్యూల్ ఖరారైంది. 27న నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు రాష్ట్ర బీజేపీ నేతలు. వచ్చే నెల 3న హైదరాబాద్ లో భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారు. మోడీ, అమిత్ షా తో పాటు మరో 38 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ఇటీవల ప్రకటించింది బీజేపీ. తెలంగాణలోని 119 నియోజకవర్గాలు కవరయ్యేలా ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నారు రాష్ట్ర నేతలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ప్లాన్ చేస్తున్నారు.